Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... విద్యార్థిని బూటులో బుల్లి కోబ్రా బుస్... ఏమైంది?- Video

Written By ఐవీఆర్
Updated: గురువారం, 21 నవంబరు 2019 (18:24 IST)
ఉదయాన్నే హడావుడిగా పిల్లల్ని స్కూలుకి పంపించేందుకు పెద్దలు హైరానాపడుతుంటారు. కేరళలో ఓ తల్లి ఇలాగే హైరానాపడిపోతూ తన కుమార్తెకి షూస్ వేసేందుకు బూట్లు తీసింది. అంతే... ఓ బూటు నుంచి బుస్... అంటూ ఓ చిన్న నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. దీనితో ఆమె షాక్ తిన్నది. 
 
వివరాల్లోకి వెళితే... కేరళలోని తిరువనంతపురం పక్కనే ఉన్న కారికకోమ్ కోవిల్‌లో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని ఉదయం పాఠశాలకు బయలుదేరడానికి సిద్ధమవుతోంది. అప్పుడు ఆమె తల్లి విద్యార్థిని షూ తీసుకొని ఆమెకి ధరింపచేయడానికి సిద్ధమైంది. అనుకోకుండా, విద్యార్థిని షూ నుండి కోబ్రా పడగవిప్పుతూ బయటకు వచ్చింది. ఇది చూసిన విద్యార్థిని, ఆమె తల్లి షాక్‌ తిన్నారు.
 
వెంటనే ఒక పెద్ద గిన్నెను తీసుకుని ఆ పాము షూ నుంచి బయటకు రాకుండా బోర్లించింది. అటు తర్వాత పాములను పట్టుకునే సురేష్‌కు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే సురేష్ ఆ పాత్రను తీసివేసి, పామును బయటకు లాగాడు. ఈ సందర్భంగా అతడు పెద్దలకి, స్కూలు పిల్లలకి హెచ్చరిక చేశాడు. బూట్లు ధరించే ముందు, లోపల కీటకాలు ఉన్నాయా అని విద్యార్థులు తనిఖీ చేయాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అతడు పేర్కొన్నాడు. చూడండి ఆ వీడియోను.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments