శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 జనవరి 2022 (13:30 IST)

దేవుడు నా బ్రా సైజు తీస్తున్నాడు: నటి శ్వేతా తివారి వివాదాస్పద వ్యాఖ్య

ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడు నా బ్రా సైజు తీస్తున్నాడు అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఫ్యాషన్‌కి సంబంధించిన వెబ్ సిరీస్ కోసం నిర్మాణ బృందం భోపాల్‌కు వచ్చింది.


ఈ వెబ్ సిరీస్ షూటింగ్ భోపాల్ లోనే జరగనుంది. ఈ సందర్భంగా చర్చలో శ్వేతా తివారీ పాల్గొంది. ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ... దేవుడు నా బ్రా సైజు తీస్తున్నాడంటూ వ్యాఖ్యానించింది..

 
ఆ సమయంలో వేదికపై ఉన్నవారు నవ్వుకున్నప్పటికీ, అది కాస్తా వివాదస్పదంగా మారింది. హిందూ విశ్వాసాలు, దేవుడిపై బాలీవుడ్ నటి వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. 

 
ఇంతకుముందు కూడా ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. శ్వేత వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి సీరియస్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు గురించి విచారణ చేపట్టాలని రాష్ట్ర పోలీసు విభాగానికి సూచనలు చేసారు.