శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (16:59 IST)

ఏప్రిల్ 20న సూర్యగ్రహణం... "రింగ్ ఆఫ్ ఫైర్".. ఆస్ట్రేలియాలో..

Solar eclipse
ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం అరుదైనది. మొత్తం చీకటితో 'రింగ్ ఆఫ్ ఫైర్'గా ఈ గ్రహణం కనిపించనుంది. ఏప్రిల్ 20న ఏర్పడే "నింగలూ" అనే సంపూర్ణ గ్రహణం ఆకాశాన్ని క్షణాలపాటు పూర్తిగా చీకటిగా మారుస్తుంది. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పి, రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావాన్ని సృష్టించినప్పుడు ఒక వార్షిక గ్రహణం ఏర్పడుతుంది.
 
దేశంలో సూర్యగ్రహణాన్ని వీక్షించడం అరుదు. ఈ సూర్య గ్రహణాన్ని ఆస్ట్రేలియా పశ్చిమ తీరం నుంచి వీక్షించడం ఉత్తమం. "నింగలూ" అనే పదం ఆస్ట్రేలియాలోని నింగలూ తీరం నుండి వచ్చింది. గ్రహణం సమయంలో పశ్చిమ ఆస్ట్రేలియాలో వీక్షించవచ్చు.
 
ఏప్రిల్ 20 ఏర్పడే గ్రహణాన్ని "హైబ్రిడ్" గ్రహణం అని కూడా అంటున్నారు. కంకణాకార ఈ గ్రహణంతో, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. దీంతో "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రభావాన్ని సృష్టిస్తుంది. 
 
ఆగ్నేయాసియా, ఈస్ట్ ఇండీస్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలోని ఇతర ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది అని నాసా మాజీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ ఎస్పెనాక్ తెలిపారు.