గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (09:26 IST)

16-04-2023 నుంచి 22-04-2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు అధికం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆదివారం నాడు పనులు సాగక విసుగు చెందుతారు. ప్రముఖులను కలిసినా ప్రయోజనకం ఉండదు. సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వాస్తుదోష నివారణ ఫలితం త్వరలో కనిపిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళ, బుధవారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. గురువారం నాడు ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష, 1, 2, 3, 4 పాదములు
ఆదాయానికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. కొత్త పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుక్రవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వేడకకు హాజరుకాలేరు.
 
సింహం మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
మనోధైర్యంతో మెలగండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. నిరుద్యోగులకు శుభయోగం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పుపడతారు. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో మెలగండి. బుధవారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. అవివాహితులకు శుభయోగం. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. గృహమార్పు కలిసివస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విదేశాల్లోని ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. పొగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. గురు, శనివారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరచరాస్తుల విక్రయంలో మెలకువ వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉందు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. మీ సమర్ధతకు త్వరలో గుర్తింపు లభిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. గృహమరమ్మతులు చేపడతారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఈ వారం నిరాశాజనకం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.