తగలబడిపోతున్న అమెజాన్ అడవులను ఆర్పేందుకు టైటానిక్ హీరో ఏం చేసాడో తెలుసా..?

Linardo help
శ్రీ| Last Modified మంగళవారం, 27 ఆగస్టు 2019 (16:05 IST)
ప్రపంచానికి ప్రాణవాయువులా నిలుస్తున్న అమెజాన్ అడవులు ఇటీవల కార్చిచ్చుకు గురై కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో 5 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 36 కోట్ల రూపాయలతో సమానం.

ఘటనపై సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించిన డీ కాప్రియో కొన్ని సంస్థలతో కలసి ఎమర్జెన్సీ చర్యలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నాడు. 20 శాతానికి పైగా భూమికి ఆక్సిజన్‌ని అందిస్తున్న అమెజాన్ అడవులు లేకుండా గ్లోబల్ వార్మింగ్‌ను మనం అదుపు చేయలేమని చెబుతూ ఈ అడవులు ప్రతి జీవి మనుగడకు చాలా ముఖ్యమైనవని ఈ ఆస్కార్ విజేత వివరణ ఇచ్చాడు.
Amezon Forest in Fire

టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లియోనార్డో ది రెవెనెంట్’ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్‌గా 2016లో మొదటి ఆస్కార్ అందుకున్నాడు. పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన పెంచే కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే డికాప్రియో అమెజాన్ అడవుల కోసం నిర్ణయానికి ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.దీనిపై మరింత చదవండి :