ఓరుగల్లులో 'కొండ'ను 'కారు' ఢీకొట్టగలదా...?
వరంగల్ జిల్లాలో కొండా దంపతులను ఢీ కొట్టాలంటే ఎవరిని రంగంలోకి దించాలి అనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది టీఆర్ఎస్ పార్టీ. బ్యాక్ టూ పెవిలియన్‌లా సొంత గూడు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొండా దంపతులు వరంగల్‌కు తిరిగి రావడంతో హన్మకొండ సురేఖ నివాసంలో ఆనందోత్
వరంగల్ జిల్లాలో కొండా దంపతులను ఢీ కొట్టాలంటే ఎవరిని రంగంలోకి దించాలి అనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది టీఆర్ఎస్ పార్టీ. బ్యాక్ టూ పెవిలియన్‌లా సొంత గూడు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొండా దంపతులు వరంగల్‌కు తిరిగి రావడంతో హన్మకొండ సురేఖ నివాసంలో ఆనందోత్సాహాలు జరిపారు పార్టీ శ్రేణులు. ఆ తరువాత తమ అభిమానులు, పార్టీ శ్రేణులతో అంతర్గతంగా సమావేశమయ్యారు కొండా దంపతులు.
పరకాల నుంచి పోటీ చేయాలని కొండా సురేఖ మనసులో మాట బయటపెట్టినా, వరంగల్ తూర్పు నుంచే కొండా సురేఖ బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు వరంగల్ పశ్చిమ నుంచి కొండా మురళిని పోటీ చేయమని అనుచరుల ఒత్తిడి చేసినట్టు సమాచారం. పరకాల, తూర్పు లేదా వరంగల్ పశ్చిమ నుంచి రెండు టిక్కెట్లు దక్కించుకుంటారనే అభిప్రాయం కొండా వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది.
మరోవైపు కొండా దంపతులు ఏకంగా కేటీఆర్‌ను టార్గెట్ చేయడంతో వీరిని ఢీ కొట్టడానికి బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది టీఆర్ఎస్. వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, గుండు సుధారాణిల పేర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం పరిశీలుస్తున్నట్టు సమాచారం. వరంగల్లు జిల్లాలో తమకంటూ ప్రత్యేక ప్రాబల్యం ఉన్న కొండా దంపతుల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.