శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (14:13 IST)

హైదరాబాదులో రూ. 10కే బిర్యానీ, నాలుగు చోట్ల బిర్యానీ పాయింట్లు

బిర్యానీ. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ప్లేటు బిర్యానీ రూ. 50కి తక్కువుండదు. కానీ ఏళ్లుగా చాలా చవకగా వెజ్ బిర్యానీ అందిస్తున్నారు ఆ హోటల్ యజమానులు. తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలోని అప్జల్ గంజ్ బస్ స్టాండు వద్ద అస్కా బిర్యానీ పాయింట్ అంటే చాలు ఎవరైనా చెప్పేస్తారు.
 
అక్కడికెళ్తే రుచిగా రూ. 10కే ప్లేటు బిర్యానీ తినేసి రావచ్చు. పేదలకు ఈ బిర్యానీ పాయింట్ ఆధారం అంటే అతిశయోక్తి కాదు. ఇదివరకు రూ. 5కే ఇచ్చేవారమనీ, ఐతే ఖర్చులు పెరగడంతో కనీసంలో కనీసం రూ. 10 చేయాల్సి వచ్చిందంటున్నారు. నిజానికి రూ. 10కే బిర్యానీ అంటే మాటలు కాదు.
 
ఇదిలావుంటే నగరంలో మరో నాలుగుచోట్ల తమ బిర్యానీ పాయింట్లు వున్నట్లు తెలిపారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వద్ద, అబిడ్స్ పోస్టాఫీస్ వద్ద, కోటి ఉమెన్స్ కాలేజీ వద్ద, సికింద్రాబాద్ రైల్వే స్టేషను వద్ద తమ పాయింట్లు వున్నట్లు తెలిపారు.