శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (17:57 IST)

ఐస్‌క్రీమ్ చాక్లెట్ దోసె టేస్ట్ చేశారా? వీడియో వైరల్

dosa
ఉదయం తీసుకునే అల్పాహారంలో ఇఢ్లీలు దోసెలుంటే లొట్టలేసుకుని తినే వారు చాలామంది. అయితే ఈ ఇడ్లీ, దోసెలతో బోర్ అంటూ చాలామంది అందులో వెరైటీల కోసం వెతుకుతున్నారు. ఇటీవలే ఐస్‌క్రీమ్ స్టిక్స్‌తో చేసిన ఇడ్లీలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

తాజాగా పిల్లలకు ఈజీగా నచ్చే ఐస్ క్రీమ్ దోసె నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దోసల్లో చాలా రకాలు వంటకాలు కూడా ఉంటున్నాయి. ఉల్లిగడ్డల దోశ అని ఉప్మా దోశ అని మసాలా దోసె ఇలా చాలా రకాలు ఉంటున్నాయి.
 
కానీ ఇప్పుడు మాత్రం ఐస్ క్రీం దోశ బాగా పాపులర్ అయిపోతోంది. అదేంటి ఐస్ క్రీమ్ దోసెనా అని ఆశ్చర్యపోకండి. ఈ వైరల్ వీడియోలో వేడి పెనంపై అప్పుడే తాజా దోసెను వేస్తున్నట్టు చూడొచ్చు. ఇక ఈ దోసె మీద ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌తో పాటు చాక్లెట్ క్రీమ్‌ను వేసి దోశ పూర్తిగా వేగేలా చూస్తాడు. ఆ తర్వాత దాన్ని తినేందుకు సర్వ్ చేస్తాడు.