బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: గురువారం, 3 మే 2018 (19:26 IST)

నా వయసు 28 ఏళ్లు... నాకో పెళ్లి కొడుకు కావాలి: ఫేస్‌బుక్‌లో యువతి పోస్ట్

అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి చేయాలంటే వారివారి తల్లిదండ్రులు ఒకప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ తిప్పలు తప్పాయి. మ్యాట్రిమొని సైట్లు రావడంతో వరుడు లేదా వధువుల కోసం తిరగాల్సిన పని తప్పింది. ఐతే ఈ సైట్లతో కొన్ని చ

అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి చేయాలంటే వారివారి తల్లిదండ్రులు ఒకప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ తిప్పలు తప్పాయి. మ్యాట్రిమొని సైట్లు రావడంతో వరుడు లేదా వధువుల కోసం తిరగాల్సిన పని తప్పింది. ఐతే ఈ సైట్లతో కొన్ని చిన్నచిన్న ఇబ్బందులుంటాయి. అందుకే ఓ యువతి ఏకంగా సోషలన్ నెట్వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్‌ను తనకు వరుడు కావాలంటూ వాడేసుకుంటోంది. 
 
వివరాల్లోకి వెళితే... జ్యోతి అనే 28 ఏళ్ల కేరళ అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తనకు మంచి వరుడు కావాలంటూ అందులో తెలిపింది. తన వయసు 28 సంవత్సరాలని చెప్పిన జ్యోతి తన తల్లిదండ్రులు మరణించారని వెల్లడించింది. తనకు ఓ సోదరుడు వున్నాడనీ, ఐతే అతడు తన ఉద్యోగం తను చేసుకుంటున్నాడని తెలిపింది. 
 
తను బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశానని చెప్పిన ఆ యువతి తన మాతృభాష మలయాళం అని వెల్లడించింది. తను ప్రస్తుతం ఒంటరిగా వున్నాననీ, తన ఫేస్ బుక్ పోస్ట్ చూసినవారు తనకు మంచి అబ్బాయిని చూసి పెట్టరూ అని అభ్యర్థించింది. ఇపుడా పోస్ట్ వైరల్ అయ్యింది.