శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (11:06 IST)

"చంద్రబాబు అనే నేను"... వైరల్ అవుతున్న గల్లా జయదేవ్ వీడియో

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో 'భరత్ అనే నేను' చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను మ

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో 'భరత్ అనే నేను' చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్వయించారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇది ఇపుడు వైరల్ అవుతోంది. "విరచిస్తా... " అంటూ సాగే పాటలో 'భరత్ అనే నేను...' అన్న పదాల వద్ద చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిననాటి మాటలను ఉంచిన జయదేవ్, ఆపై పాట ఆసాంతాన్ని వినిపిస్తూ, బాబు వీడియోలను జోడించారు.
 
ముఖ్యంగా, 1996లో హైటెక్ సిటీని చంద్రబాబు ప్రారంభించడం, పాదయాత్ర, వివిధ సంక్షేమ పథకాల వీడియో బిట్లను కలిపారు. పలు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను, అభివృద్ధి పథకాలు, వివిధ సదస్సుల ఫోటోలు, జాతీయ స్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు, పుష్కరాల ఏర్పాట్లు, ప్రజలతో కలిసున్న చిత్రాలను ఉంచారు. అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఫొటోలను జోడించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను మీరూ చూడండి.