థర్డ్ పార్టీలతో జాగ్రత్త.. మరిన్ని డేటా లీకులకు ఆస్కారం వుంది: ఫేస్‌బుక్ హెచ్చరిక
ఫేస్‌బుక్ కేంబ్రిడ్జ్ అనలటికా వ్యవహారం పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. మరిన్ని లీకులు జరిగే ప్రమాదం వున్నట్లు ఫేస్‌బుక్ హెచ్చరించింది. ఎన్నికల్లో ప్రాబల్యం కోసం నకిలీ ఖాతాలను భారీగా వాడుకునే ప్రమా
ఫేస్‌బుక్ కేంబ్రిడ్జ్ అనలటికా వ్యవహారం పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. మరిన్ని లీకులు జరిగే ప్రమాదం వున్నట్లు ఫేస్‌బుక్ హెచ్చరించింది. ఎన్నికల్లో ప్రాబల్యం కోసం నకిలీ ఖాతాలను భారీగా వాడుకునే ప్రమాదముందని.. థర్డ్ పార్టీలు వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసే ఉదంతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఫేస్‌బుక్ హెచ్చరించింది.
అంతేగాకుండా మీడియా సంస్థలు కూడా సమాచారాన్ని లీక్ చేసే ఆస్కారం వుందని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో ప్రజల భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలు, స్పామ్, డేటా వ్యాప్తి వంటివి జరిగే ఆస్కారం వుందని ఫేస్‌బుక్ హెచ్చరించింది. తమ నియమ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల సమాచారన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్ వెల్లడించింది.
యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి ఫేస్‌బుక్ సమర్పించిన త్రైమాసిక నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. వినియోగదారుల్లో తమపై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, అంతేగాకుండా తమ సంస్థ పేరు ప్రఖ్యాతులు, బ్రాండ్‌పై పెద్ద దెబ్బే పడే ముప్పు ఉందని ఫేస్‌బుక్ తెలిపింది.