శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:47 IST)

'నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు' : వరుణ్ తేజ్

టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్ప

టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను అన్నా అని పిలిచినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అన్నంత పని కూడా చేసింది. ఆ తర్వాత ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
 
ఈ విమర్శలకు ధీటుగా వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వరుణ్ తేజ్ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 'నీ గురించి విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు' అంటూ దిమ్మదిరిగే పోస్టు పెట్టాడు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.