నాగార్జున సాగర్ జలాశయం ఒడ్డున ఆనందంగా ఆడుకుంటున్న నీటి కుక్కలు

Water Dogs
ఐవీఆర్| Last Modified బుధవారం, 21 జులై 2021 (20:05 IST)
నీటి కుక్కలు. విపరీతంగా నదులకు వరద వచ్చినప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఈ నీటి ప్రవాహం అందాలను చూసేందుకు వచ్చిన వీక్షకులకు నీటికుక్కలు కనిపించి మరింత సంభ్రమాశ్చర్యాన్ని కలిగించాయి. రిజర్వాయర్ లోని లాంచీ స్టేషన్ సమీపంలో ఇవి తిరుగాడుతూ కనువిందు చేసాయి. ఈ నీటికుక్కలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇవి ఇదివరకు పెద్దసంఖ్యలో కనిపించేవి కానీ ఇప్పుడు పెద్దగా దర్శనం ఇవ్వడంలేదు.దీనిపై మరింత చదవండి :