మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (22:17 IST)

WTC Final.. ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటన_All The Best టీమిండియా

WTC Final
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్ధం అయ్యింది. మరికొద్ది గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తెరలేవనుంది. ఈ మేరకు టీమిండియా తరపున బరిలోకి దిగే పదకొండు మంది ప్లేయర్లను బీసీసీఐ ప్రకటించింది. జూన్ 18 నుంచి 22 వరకు ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది.

ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత ఓపెనింగ్ జోడీగా ఖరారు చేసింది. అలాగే పుజారా, విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారత బ్యాటింగ్ క్రమంలో టాప్-5లో ఉన్నారు.
 
రిషభ్ పంత్‌‌ను వికెట్ కీపర్‌‌గా జట్టులో స్థానం సంపాదించాడు. గత కొద్దికాలంగా నిలకడగా రాణిస్తుండడంతో.. రిషభ్‌కు చోటు ఖాయమైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ శతకంతో రాణించాడు ఈ యువ బ్యాట్స్‌మెన్.

రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో అద్భుతమైన ప్రదర్శనలో పాటు, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ రాణించడంతో జట్టులో తన స్థానాన్ని ఖాయంచేసుకున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. 
 
పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ త్రయం కూడా చారిత్రాత్మక ఫైనల్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ప్లేయింగ్‌ లెవన్‌లో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. ఇలా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.
 
ప్లేయింగ్ లెవన్: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ.