బుధవారం, 15 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (16:20 IST)

WTC Final కౌంట్ డౌన్ మొదలు.. పొంచివున్న వర్ష గండం

Rains
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final)కు కౌంట్ డౌన్‌ మొదలైంది. ఈ శుక్రవారం ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గండం పొంచివుంది. 
 
రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఇంకా 80 శాతం వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
 
జూన్ 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. రెండూ అత్యుత్తమ జట్లే కావడంతో పోరు రసవత్తరంగా సాగుతుందని అందరూ భావిస్తున్నారు. రిజర్వు డే ఉందని సంతోషించినా.. ఇప్పుడు ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం ఉందని తెలియడంతో నిరాశకు గురవుతున్నారు.