శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (09:51 IST)

జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవం.. సైకిల్ తొక్కితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

సాంకేతికపరంగా ఎన్నెన్నో సౌకర్యాలు రావడంతో సైకిల్‌ వాడకం మరుగున పడిపోయింది. సైకిల్‌ అనేది సరళమైన, సరసమైన, పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు. అయితే దీన్ని వాడకం ప్రస్తుతం తగ్గిపోయింది. జూన్‌ 3వ తేదీన ప్రపంచ సైకిల్‌ దినోత్సవం జరుపుకొంటారు. ఈ సందర్భంగా సైకిలింగ్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 
 
సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శారీరక వ్యాయమానికి సైకిల్‌ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పని చేస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు.
 
ఇకపోతే.. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్‌ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రొఫెసర్‌ స్వన్సన్‌ సహకారంతో ఐజాక్‌ ఫెల్డ్‌ ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కోసం లోగోను తయారు చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా ఉంది.
 
సమాజంలో సైక్లింగ్‌ సంస్కృతిని ఎంతో డెవలప్‌ చేయడానికి, ప్రోత్సహించడానికి కావాల్సిన ఉత్తమ పద్దతులను సరైన మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపర్చడానికి సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదచారుల భద్రతను కాపాడడానికి సైకిల్‌ వాడకాన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది.