మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2013 14
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (17:12 IST)

వార్షిక బడ్జెట 2023-24 : కొత్త పన్ను విధానం ఇలా...

income tax slabs
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. లక్షలాది మందికి ప్రయోజనం చేకూరేలా వ్యక్తిగత పన్ను రిబేట్‌ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదాయపన్నుకు సంబంధించిన కొత్త విధానాన్ని ఆమె ప్రవేశపెట్టారు. 
 
రూ.7 లక్షల ఆదాయం వరకు ఉన్న వ్యక్తులకు మినహాయింపులు ఉపయోగించుకుని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే, పన్ను చెల్లించు శ్లాబుల సంఖ్యను ఐదుకు తగ్గిస్తున్నట్టు తెలిపారు. కొత్త పన్ను విదానం డిఫాల్టుగా అమలుకానుంది. ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలివేశారు. 
 
కొత్త పన్ను విధానాన్ని పరిశీలిస్తే.. 
* రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* శ్లాబుల సంఖ్య 5కు తగ్గింపు. పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంపు. 
* రూ.0-3 లక్షలు ఆదాయం. ఎలాంటి పన్ను ఉండదు. 
* రూ.3-6 లక్షల ఆదాయం వరకు - 5 శాతం పన్ను
* రూ.6-9 లక్షల వరకు 10 శాతం పన్ను
* రూ.9-12 లక్షల వరకు 15 శాతం పన్ను 
* రూ.12-15 లక్షల వరకు 20 శాతం పన్ను 
* రూ.15 లక్షలకు పైగా ఆదాయం వచ్చేవారు 30 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి వుంటుంది.