మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:55 IST)

పిల్లలు, యువకుల కోసం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు: ఆర్థిక మంత్రి

digitalclass-rooms
పిల్లలు, యువకుల కోసం డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పిల్లల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో గిరిజనుల ఏకలవ్య పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
 
పశుపోషణ, మత్స్య పరిశ్రమలకు రూ.20 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మత్స్యకారులు, చేపల విక్రయదారులు, చేపల సంబంధిత పరిశ్రమల్లో ఉన్నవారి అభివృద్ధికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
 
కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోదీ పాలనలో తలసరి ఆదాయం భారత్‌లో రూ.1.97 లక్షలకు పెరిగింది. అలాగే కర్ణాటకలో కరువు సాయం కింద రూ.5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.