1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (18:18 IST)

వాస్తు: ఆడ, మగ శునకాలను ఎవరు పెంచవచ్చు..?

dogs
పూర్వ కాలం నుంచి శునకాలతో మనుషులతో సంబంధం వుంది. శునకాలను మానవులు పెంచడం అనాది కాలం నుంచి వస్తోంది. శునకాలను పెంచడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. పేదధనిక వర్గాలతో సంబంధం లేకుండా అందరి ఇంట శునకాలను పెంచడం చేస్తున్నారు. ఎప్పుడూ మనిషితో జీవించే, శునకాలను పెంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే అంటున్నారు వాస్తు నిపుణులు. 
 
మగ ఇల్లు లేదా ఆడ ఇల్లు అంటే ఈశాన్య దిశ పెరుగుదల లేదా తగ్గడం ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా కొన్ని గృహాలలో పురుషుడు కుక్కలను పెంచడం ద్వారా ఇంటి యజమానుల కష్టాలు తాత్కాలికమేనని వాస్తు నిపుణులు అంటున్నారు. పెను సమస్యలు దూరం కావడం.. చిన్న సమస్యలు అతిపెద్ద సమస్యగా మారకుండా నివారించబడతాయి. 
 
ఎవరు ఆడ కుక్కను పెంచవచ్చు?
మీ ఇంట ఉత్తరం, తూర్పు మూసి వుంటే.. ఉత్తరం లేదా తూర్పు వైపు ఒక కిటికీ కూడా పెట్టడం వీల్లేదు అనే వారు ఓ ఆడ శునకాన్ని పెంచుకోవచ్చు.

అలాగే తూర్పు గోడ మూసివేయబడింది. కానీ ఉత్తరం వైపు తలుపు ఉంది. ఉత్తరం వైపు తెరిచే వుంటే వారు కూడా ఆడ శునకాన్ని పెంచవచ్చు. ఇంటి ఆగ్నేయంలో బావి వుంది. దానిని మూతపెట్టలేని పరిస్థితిలో వుంటే..ఆడ శునకాన్ని పెంచడం చేయవచ్చు. 
 
ఇద్దరు మగ సంతానం కలిగివున్నవారు.. పెద్ద కుమారుడికి పెళ్లి కావడం... కానీ, అతని భార్యకు వైద్య ఖర్చులు అవుతుంటే.. ఆ ఇంట ఆగ్నేయం కోతపడి వుంటుంది. ఇది వాస్తు పరంగా మహిళా భాగం. ఇలాంటి ఇబ్బందులుంటే.. ఆడ కుక్కను పెంచుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. 
 
మగ కుక్కలను ఎవరు పెంచవచ్చు?
మీ ఇల్లు లేదా స్థలం పురుషుల పేరిట వుంటే.. అలాగే ఈశాన్యం, వాయవ్యం తెరిచే వుండి.. పెద్దగా వాస్తు సమస్యలు లేకపోయినా మగశునకాన్ని పెంచుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.