ఆకలేయట్లేదా? క్యారెట్ పచ్చడి టేస్ట్ చేసి చూడండి....

క్యారెట్‌ను అధికంగా తింటే విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అలాగే జీవితాంతం అద్దాలు పెట్టుకోకుండా ఉండాలంటే వారానికి ఐదారు క్యారెట్లు తీసుకోవాలి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించాలంటే క్యారెట్‌ను తీసుకోవా

సోమవారం, 2 జులై 2018 (14:56 IST)
క్యారెట్‌ తింటే విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అలాగే జీవితాంతం అద్దాలు పెట్టుకోకుండా ఉండాలంటే వారానికి ఐదారు క్యారెట్లు తీసుకోవాలి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించాలంటే క్యారెట్‌ను తీసుకోవాల్సిందే. అంటువ్యాధులు, అలెర్జీలను అడ్డుకునేందుకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో క్యారెట్ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కడుపులో ఆమ్లాలు చేరడం ద్వారా ఏర్పడే తేపులు, పిత్త వ్యాధులు, ఆకలి లేమిని దూరం చేసుకోవాలంటే క్యారెట్ తురుముతో పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
క్యారెట్లు - అరకేజీ 
కొబ్బరి తురుము - 2 కప్పులు 
నిమ్మరసం - పావు కప్పు 
మిరియాలు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
పచ్చిమిర్చి - 10
కొత్తిమీర - 1కట్ట
ఉప్పు - రుచికి తగినంత
నూనె - కావలసినంత
 
తయారీ విధానం :
ముందుగా క్యారెట్ తురుమును ప్యాన్‌పై లేతగా వేపుకోవాలి. అందులో కొబ్బరి తురుము, కొత్తిమీర, మిరియాలు, పచ్చిమిర్చి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేయాలి. తరువాత వెంటనే అందులో ముద్దుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న ముద్దను చేర్చి దించేయాలి. అంతే క్యారెట్ పచ్చడి రెడీ. 

అన్నీ చూడండి

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక

ముంబై లోకల్ ట్రైన్‌లో సీట్ల కోసం ఘర్షణ - ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే ప్రయోగం

తిరుమల గిరులు కిటకిట.. గోగర్భం డ్యామ్ వరకు భక్తుల బారులు

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments