శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 2 జులై 2018 (09:32 IST)

బీరకాయ, రొయ్యలు బిర్యాని తయారీ విధానం....

బీరకాయలో పీచు, విటమిన్‌ సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటు

బీరకాయలో పీచు, విటమిన్‌ సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటుకు తగ్గించేందుకు తోడ్పడతాయి. మరి బీరకాయతో బిరియానీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. 
 
కావలసిన పదార్థాలు:
బీరకాయలు - 2
శుభ్రం చేసిన రొయ్యలు - 400 గ్రా 
నూనె - 2 స్పూన్స్ 
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిర్చి - 4 
కరివేపాకు - 4 రెబ్బలు 
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్
కారం - ఒకటిన్నర స్పూన్ 
గరం మసాల పొడి - అర స్పూన్ 
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - గుప్పెడు 
దనియా, జీర, పసుపు పొడులు - అర టీ స్పూన్ చొప్పున
 
తయారుచేసే విధానం :
ముందుగా రొయ్యల్లో 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూను ఉప్పు, దనియా, జీర, పసుపు పొడులు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి. అదే బాణలిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా వేగించాలి. ఇప్పుడు తొక్కతీసిన బీర ముక్కలు, ఉప్పు కలిపి మగ్గించాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించుకోవాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. చివరగా వేడి వేడి అన్నంలో ఈ మిశ్రమాన్ని కలుపుకుంటే బీరకాయ బిర్యాని రెడీ.