శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (13:05 IST)

చెరువులో రొయ్యలు పడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎందుకు?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరులోని రొయ్యల చెరువు క్షేత్రాలను సందర్శించి రొయ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, రొయ్యల సాగులో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రొయ్య ధర మార్కెట్లలో ఒక రకంగా వుంటే... రైతుల వద్దకు వచ్చేసరికి దోచేస్తున్నారని రైతులు గోడు వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు కొందరు సిండికేట్ అయ్యి తమను దోచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్య రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కొద్దిసేపు రొయ్యల చెరువులో రొయ్యలకు మేత వేసి రొయ్యలను పట్టారు.