కంప్యూటర్ ముందు ఒకే వైపు చూడొద్దు.. ప్రతి 20 నిమిషాలకు.. 20 అడుగుల దూరంలో?
కంప్యూటర్ ముందు గంటల పాటు కూర్చుంటున్నారా? అయితే ప్రతి 20 నిమిషాలకు, 20 ఫీట్ల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం ద్వారా మీ కళ్లకు చక్కని వ్యాయామం చేసినట్లవుతారు. మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముం
కంప్యూటర్ ముందు గంటల పాటు కూర్చుంటున్నారా? అయితే ప్రతి 20 నిమిషాలకు, 20 ఫీట్ల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం ద్వారా మీ కళ్లకు చక్కని వ్యాయామం చేసినట్లవుతారు. మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడపవలసి వచ్చినపుడు, వివిధ రకాల వస్తువులను వివిధ కోణాలలో తరచుగా చూస్తూ ఉండటం మర్చిపోకండి.
ఒకే వైపు చూడటాన్ని తగ్గించి, వివిధ కోణాలలో చూడటం కంటి ఆరోగ్యానికి మంచిది. ఎపుడైతే అధిక పని లేదా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నపుడు తరచుగా విశ్రాంతి తీసుకోండి. ఈ విశ్రాంతుల వలన మీ కళ్ళపైన పడే ఒత్తిడిని తగ్గిపోతోంది. కళ్ళకు విశ్రాంతి కోసం కంప్యూటర్ తెరపై ఉన్న కాంతిని తగ్గించుకోండి. కానీ, తెర కాంతిని మరి ఎక్కువగా తగ్గించకండి ఇది కుడా కళ్ళకు ప్రమాదాన్ని కలుగచేస్తుందని ఐ కేర్ నిపుణులు అంటున్నారు.