ఉసిరి గింజల పొడిని మహిళలు తేనెతో కలిపి తీసుకుంటే..
ఉసిరి గింజలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిగింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
ఉసిరి గింజల పొడి తీసుకుంటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి గింజల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే మహిళలు బరువు తగ్గుతారు. ఉసిరిగింజల పేస్ట్‌ను నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఉసిరిగింజల పొడిని తేనెతో కలిసి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
ఉసిరి విత్తనాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. దీని కోసం ఎండిన ఉసిరి విత్తనాల పొడిని కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రాంతాలకు అప్లై చేస్తే ముఖంలో మొటిమలు మటుమాయం అవుతాయి.