1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 మే 2023 (22:59 IST)

తేనెలో పసుపు వేసి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

పసుపును ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం. పసుపుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనిచ్చి చల్లారాక ఆ నీటితో ఇంటి ఫ్లోర్ శుభ్రం చేస్తుంటే క్రిములు నశిస్తాయి.
 
గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ప్రతిరోజు రాత్రి తాగితే జలుబు, తుమ్మలు, దగ్గు లాంటివి తగ్గుతాయి. పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడుసార్లు చొప్పున 4 నెలల పాటు తీసుకుంటే ఇస్నోఫిలియా వ్యాధి తగ్గుతుంది. ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి సిద్ధం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఆహారానికి ఆరగంట ముందు పావుస్పూను పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది.