శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (15:28 IST)

బహిష్టు సమయంలో పెయిన్ కిల్లర్‌గా పనిచేసే పండు ఏది?

బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కూడా. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కూడా. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
బొప్పాయిలో విటమిన్‌ సి, విటమిన్‌, బెటా కెరొటిన్‌ వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు మీలో కనిపించకుండా కాపాడతాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును తింటే డయాబెటిస్‌ బారిన పడరు.
 
శరీర బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది దివ్యౌషధం. పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువగా ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం లేదు. బొప్పాయిలో విటమిన్‌ సి ఎక్కువ ఉండడంతో శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది.
 
బొప్పాయిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండడంతో కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది. బహిష్టు సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. బహష్టు సమయంలో రక్తస్రావం సరిగా క్రమంగా అయ్యేవిధంగా చేస్తుంది.