శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (11:58 IST)

మహిళలూ టీవీ సీరియల్స్ చూడొద్దు.. ప్రశాంతతను ఇచ్చే సంగీతం వినండి

మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లో పని.. కార్యాలయాల్లో పని చేసుకుంటూ ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా శరీరాన్ని యాంత్రికంగా మార్చేసుకుని సంతోషానికి దూరం అవుతున్నారు. తద్వారా వృద్ధా

మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లో పని.. కార్యాలయాల్లో పని చేసుకుంటూ ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా శరీరాన్ని యాంత్రికంగా మార్చేసుకుని సంతోషానికి దూరం అవుతున్నారు. తద్వారా వృద్ధాప్య ఛాయలు అతి త్వరలోనే అలముకుంటున్నాయి. దీంతో మహిళల ముఖంలో నవ్వే కరువైంది. కానీ ఇంట్లో మహిళలు ఎంత ఆనందంగా ఉంటే కుటుంబం అంత బాగుంటుందని సైకాలజిస్టులు అంటున్నారు. 
 
ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని రాత్రి పడుకొనే వరకు పరుగులు తీస్తున్నప్పటికీ.. ఆనందాన్ని మాత్రం మిస్ కాకూడదంటున్నారు సైకాలజిస్టులు. హ్యాపీగా ఉండకపోవడం ద్వారా మహిళలు.. అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడంతో పాటు.. ఆ ప్రభావం కుటుంబంపై పడుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. మహిళలు ఎంత ఆనందంగా ఉంటే కుటుంబం అంత ఆనందంగా.. ఆరోగ్యంగా ఉంటుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. 
 
అనవసర విషయాలను పట్టించుకోకుండా.. మానసిక ఆందోళనను పెంచే టీవీ ప్రోగ్రాములు సీవీ సీరియల్స్ వంటివి చూడకుండా.. ప్రశాంతతను ఇచ్చే సంగీతాన్ని వినాలి. హడావుడిని పక్కనపెట్టాలి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. ఇలా కొన్నింటిని ఫాలో చేయడం ద్వారా మహిళలు హ్యాపీగా ఉండొచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు.