శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (20:50 IST)

ఆడపిల్లలను ఇలా పెంచండి.. ఏడవటం వల్ల..?

girls
నేటి కాలంలో అమ్మాయిలను తప్పు పట్టే అంశాలు చాలానే జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఆడపిల్లలకు భయాన్ని కలిగించి, వారిని కించపరిచేలా మాట్లాడకూడదు. 
 
ఆడ బిడ్డ కంటే మగబిడ్డకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలి. మగబిడ్డ పుట్టడంతో పెద్ద కూతురుపై దృష్టి తగ్గే వాతావరణం ఉండకూడదు. తల్లితండ్రులు మాటల్లో చెప్పకుండా స్త్రీ, పురుషులు సమానం అనే విధంగా పెంచాలి. 
 
'వాదించకండి, నేను చెప్పేది వినండి' అని ఆడపిల్లలకు సాధికారత కల్పించే బదులు, ఒక చర్యతో లాభనష్టాలను ప్రేమతో అర్థం చేసుకోవడం నేర్పించాలి. 
 
అలాగే అమ్మాయిలకు స్వతంత్రంగా ఆలోచించడానికి, వ్యవహరించడానికి అనుమతించాలి. ఆడపిల్ల తనకు క్రికెట్, రోబోటిక్స్, కరాటే వంటి వాటిపై ఆసక్తి ఉన్న ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు నిశ్చింతగా నేర్పించడం చేయాలి.  
 
నేటి ప్రపంచంలో మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. అమ్మాయిలు తన ప్రతిభను పూర్తిగా చాటుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని ప్రోత్సాహం అందించాలి. 
 
అబ్బాయి ఏడవడం తప్పు అని చెప్పేవాళ్లు ఆడపిల్లని కూడా అలానే పెంచాలి. ఏడవడం వల్ల ఏమీ జరగదని అర్థం చేసుకునేలా చేయాలి.