ఎండుద్రాక్షని నీటిలో వేడిచేసి తాగితే.. నెలసరి కడుపునొప్పి?
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శ
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శక్తి కావాలి.. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎండుద్రాక్షల్ని పాలల్లో కలిపి వేడిచేసి తాగడంవల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని కొంత నీటిలో వేడి చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఎండుద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఐదు నుంచి పదివరకు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధ పదార్థాలు బయటకు పోతాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. మహిళలూ రోజు ఐదేసి ఎండుద్రాక్షలను తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.