బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (15:05 IST)

అమేజింగ్ హ్యాండ్ స్కిల్ రంగోలి... (Video)

ముగ్గు లేదా రంగవల్లి లేదా రంగోలి అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలి భాగాలను అందంగా అలంకరించు ప్రాచీనకాలం నుంచి వస్తున్న భారతీయ సాంప్రదాయం. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి త

ముగ్గు లేదా రంగవల్లి లేదా రంగోలి అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలి భాగాలను అందంగా అలంకరించు ప్రాచీనకాలం నుంచి వస్తున్న భారతీయ సాంప్రదాయం. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళతోగాని సుద్ద ముక్కలతోగాని తడిచేసిన తర్వాత వేస్తారు. 
 
ఆధునికకాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్‌తో వేస్తున్నారు. ఇవిరోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన, అంచుల వెంబటి వేసుకుంటారు. 
 
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోనూ, పట్టణాలలలోనూ నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచే వారికి బహుమతులు అందజేస్తుంటారు. అయితే, ఈ యువతి పిండితో ఎంత అందమైన ముగ్గు (నెమలి)ను వేసిందో మీరే ఈ వీడియో వీక్షించండి.