మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By ivr
Last Modified: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:06 IST)

ప్రపంచంలోనే అందమైన 'పవర్'ఫుల్ వెయిట్ లిప్టింగ్ మహిళ(ఫోటోలు)

వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామంది పురుషుల గురించి మాట్లాడుకుంటూ వుంటారు. మన రాష్ట్రం విషయానికి వస్తే కరణం మల్లీశ్వరి పేరు చెప్పుకుంటారు. ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందమైన ఓ యువతి శక్తివంతమైన వెయిట్ లిఫ్టర్ గా పేరుగాంచింది. ఆమె రష్యా దేశస్తురాలు. పేరు యులియ

వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామంది పురుషుల గురించి మాట్లాడుకుంటూ వుంటారు. మన రాష్ట్రం విషయానికి వస్తే కరణం మల్లీశ్వరి పేరు చెప్పుకుంటారు. ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందమైన ఓ యువతి శక్తివంతమైన వెయిట్ లిఫ్టర్ గా పేరుగాంచింది. ఆమె రష్యా దేశస్తురాలు. పేరు యులియా విక్టోరోవ్న. వయసు 20 ఏళ్లు మాత్రమే. 
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
 
ఆమె తన గురించి చెప్పుకుంటూ... తను ఏనాడు పవర్ లిఫ్టర్ అవ్వాలని కోరుకోలేదనీ, ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం చేస్తుండేదానినని చెప్పుకొచ్చింది. ఐతే అలా చేస్తూ వున్న సమయంలో తన శరీర దారుఢ్యం శక్తివంతంగా మారుతుండటంతో ఆ తర్వాత తనకు పవర్ లిఫ్టింగ్ పైన ఆసక్తి కలిగిందని వెల్లడించింది. 
 
కాగా జులియా తొలిసారిగా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 2013లో పాల్గొంది. ఇప్పటివరకూ 3 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. 20 ఏళ్ల అమ్మాయి ఇలా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడంపై మీరు ఏమంటారు... మీ స్పందన తెలియజేయండి.