రోజ్ వాటర్ వల్ల అందంతో పాటు ఆరోగ్యం
రోజ్ వాటర్ చర్మానికి మేలు చేస్తుంది. అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించబడుతుందని తెలిసినదే. అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పెంపొందిస్తుంది. ఇది ఆహార ఉత్పత్తులలో కూడా ఉపయోగించబడుతుంది. రోజ్ వాటర్ రిలాక్సెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. రోజ్ వాటర్ తాగడం వల్ల కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
రోజ్ వాటర్ తీసుకుంటే... అది స్కిన్ ఇన్ఫ్లమేషన్‌తో పోరాడుతుంది.
వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది.
గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
కంటి ఇన్ఫెక్షన్లకు మందుగా ఉపయోగపడుతుంది.
గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది.
తలనొప్పి చికిత్సకు సహాయం చేస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.