శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2022 (23:13 IST)

హెర్బల్ స్టీంతో అదిరిపోయే అందం, ఏం చేయాలి?

ముఖం కాంతివంతంగా మారాలంటే ఎలాంటి మేకప్ లేకుండా హెర్బల్ స్టీం పెడితే సరిపోతుంది. అదెలాగో చూద్దాం. సహజసిద్ధమైన నూనె, గ్లిసరిన్‌తో తయారయిన ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో ముఖాన్ని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా మారుతుంది.

 
ఆ తర్వాత చర్మం రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, అదనపు నూనె బైటకు పోయేందుకు ఓ గిన్నెలో ఆరు గ్లాసుల మరిగిన నీటితో నింపి అందులో గుప్పెడు గులాబీ రేకులు, పల్చగా చక్రాల్లా కోసిన నిమ్మకాయ ముక్కలను వేసి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.

 
ఈ హెర్బల్ స్టీం ముఖం యొక్క చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మ, గులాబీ రేకుల నుంచి వచ్చిన ఆవిరి చర్మానికి మెరుపును అందిస్తుంది.