ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-02-2021 గురువారం దినఫలాలు - వినాయకుడుని ఆరాధించిన సంకల్పసిద్ధి

మేషం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం, వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికం కావడంతో ఆందోళన చెందుతారు. బంధు మిత్రుల నుంచి అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. 
 
వృషభం : భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు, వ్యాపారాల విస్తరణకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో నిరుత్సాహం కలిగిస్తుంది. నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక పనివారలుక పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మిథునం : విదేశీయత్నాలు వాయిదాపడతాయి. రావలిసిన ధనం కొంత ముందూ వెనుకలగానైనా అందుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు ప్రయాణాలలో పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ధాన్యం, అపరాలు, నూనె, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఆశాజనకం. చిత్తశుద్ధితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ముఖ్యులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. షేర్ల అమ్మకం వాయిదాపడటం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు.
 
కన్య : వృత్తులవారికి చిరు వ్యాపారులకు ఆశించినత సంతృప్తి ఉండదు. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ముఖ్యమైన విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. 
 
తుల : మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు, అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
వృశ్చికం : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకో కలిసివస్తుంది. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. గృహమార్పు వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తులవారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఖర్చులకు సార్థకత, ప్రయోజనం పొందుతారు.
 
ధనస్సు : కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు మాని ఏకాగ్రతతో పని చేయడం శ్రేయస్కరం. అనుకోకుండా పాత బాకీలు వసూలవుతాయి. క్రయ, విక్రయాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
మకరం : ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీలకు తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 
 
కుంభం : బ్యాంకు పనులు వాయిదాపడతాయి. అందరినీ అతిగా నమ్మే మీ స్వభాం ఇబ్బందులకు దారితీస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకం. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. 
 
మీనం : దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు  పెంపొందుతాయి. ధనవ్యయంలో మితం పాటించండి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. మొక్కవోని ధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానిక బాగా శ్రమించాలి.