మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-09-2020 గురువారం దినఫలాలు - రాఘవేంద్ర స్వామిని పూజిస్తే..

మేషం : కాంట్రాక్టర్లకు ఆందోళన పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు ఎదురుకావడం పల్ల ఆందోళన చెందుతారు. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం : నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ధనవ్యం, చెల్లింపులు విషయంలో ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
మిథునం : మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. రాజకీయాల్లో వారికి విరోధులు విషయంలో అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం : వస్త్ర, బంగారు, ఆభరణాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యుల రాక ఆనందం కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. గృహానికి సంబంధించిన వస్తువులు అమర్చుకుంటారు. ఖర్చులు రాబడికి తగ్గట్టుగానే ఉంటాయి. 
 
కన్య : మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు లాభదాయకం. హోటల్, తినుబండారు వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తి కానరాగలదు. విందు, వేడుకలలో పాల్గొంటారు. 
 
తుల : స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలు త్వరగా ముగించుకుంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నేడు, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. 
 
వృశ్చికం : అవసర సమయంలో అయినవారే సహాయం చేసేందుకు ముఖం చాటేస్తారు. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. నూనె, కంది, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, ఆవాలు స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. కొంతమంది మిమ్మల్ని నిచ్చెనలా వాడుకుని పురోభివృద్ధి చెందుతారు. 
 
ధనస్సు : మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. 
 
మకరం : నోరు అదుపులో ఉంచుకోవవడం శ్రేయస్కరం. రచయితలకు ప్రోత్సాహకరం. గృహానికి సంబంధించిన వస్తువులు అమర్చుకుంటారు. మీ నమ్మకాలు అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. 
 
కుంభం : మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల హితవు మీపై బాగా పనిచేస్తుంది. రుణాలు చెల్లిస్తారు. రాజకీయ నాయకులు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రేమికులకు మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాయిదాపడతాయి. 
 
మీనం : సమయం, సందర్భం వచ్చేవరకు మీ అభిప్రాయాలను గోప్యంగా ఉంచండి. ఇసుక, క్వారీ, బిల్లింగ్ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ఖర్చులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.