శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-09-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల...

మేషం : ధనం బాగా సంపాదించి దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్లమంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశాజనకం. 
 
వృషభం : మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పోస్టల్, ఎల్.ఐ.సి, ఇళ్ళ స్థలాల ఏజెంట్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఆర్థికలాదేవీలు, ఇతరాత్రా ఒప్పందాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. రుణ యత్నాల్లో అనుకూలత, చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. 
 
కర్కాటకం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యులలో కలిసి సరదాగా గడుపుతారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
సింహం : దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయ. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి.
 
కన్య : ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. వైద్యులకు పురోభివృద్ధి. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సమస్యల పరిష్కారానికి సన్నిహితులు అన్ని విధాలుగా సహకరిస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
తుల : ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతనోత్సాహం కానవస్తుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరిం మంచిదికాదు. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. సానుకూల ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు అల్లర్లు, సామాజిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. గృహమార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలు పట్టువిడుపు ధోరణితో మెలగాలి. 
 
ధనస్సు : ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలు ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. 
 
మకరం : ఉన్నతాధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతితో అకారణ కలహం, పట్టింపులు ఎదుర్కొంటారు. ఏజెంట్లు, బ్రోకర్లు, మార్కెట్ రంగాల వారు ఎంత శ్రమించినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. 
 
కుంభం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి యత్నించండి. ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి.
 
మీనం : చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. పెద్దల ఆరోగ్యం కలవరపరుస్తుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి వ్యయం చేయవలసి వస్తుంది. ప్రతి విషయంలోను ఓర్పు, విజ్ఞతగా వ్యవహరించాలి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి.