మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:30 IST)

03-09-2020 గురువారం దినఫలాలు - నృశింహస్వామిని ఆరాధిస్తే...(video)

మేషం : ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో హడావుడిగా ఉంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. బ్యాంకుల్లో చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం : స్టేషనరీ, ప్రింటింగ్, రంగాలలోనివారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్ని అర్థిస్తారు. దంపతుల మధ్య కలహాలు, విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. 
 
మిథునం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. మిమ్మలను పొగిడేవారిని ఓ కంట కనిపెట్టండి. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. 
 
కర్కాటకం : మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. రుణ యత్నాల్లో అలసత్వం వంటి చికాకులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు, పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. విదేశాలు వెళ్లే ప్రయాణాలు వాయిదాపడతాయి. చేపట్టిన పనిలో దృఢ సంకల్పం ఉంటే విజయం తథ్యం. 
 
సింహం : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూనె, ఎండుమిర్చి, చింతపండు, వ్యాపారులకు దినదినాభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. అనుమానాలు, అపోహలు వీడి ఆత్మ విశ్వాసంతో శ్రమించండి. సత్ఫలితాలు లభిస్తాయి. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పట్టుదల చాలా అవసరం. 
 
కన్య : కాంట్రాక్టుల కోసం యత్నిస్తారు. ముఖ్యంగా ఇరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి. క్లిష్టతరమైన పనులు ఎలా అధిగమించాలో తెలియనపుడు తగిన సూచనలు సలహాలు పాటించండి. ఉద్యోగస్తులకు తలపెట్టిన పనిలో అవాంతరాలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. 
 
తుల : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. వస్త్ర, బంగారు విలువైన వస్తువులను అమర్చుకుంటారు. 
 
ధనస్సు : ఇరుగుపొరుగువారికి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 

 
మకరం : వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పరష్కారమవుతాయి. రాజకీయ నాయకులకు కార్యక్రమాలు వాయిడతాయి. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. 
 
కుంభం : ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. మీ వ్యవహారాలను స్వయంగా సమీక్షించుకోవడం ఉత్తమం. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. 
 
మీనం : మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే కానిపనులు నెరవేరగలవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడటం మంచిది. బ్యాంకు వ్యవహారాల్లో జాగరూకతతో మెలగండి.