ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

01-09-2020 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజిస్తే మీ మనోవాంఛలు...

మేషం : కాంట్రాక్టర్లకు రావలసిన ధనం సకాలంలో అందకపోవడంతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఖర్చులు అధికం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే నెరవేరగలదు. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. 
 
వృషభం : ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. రుణం ఏ కొంతైనా తీర్చడానికై చేయు ప్రయత్నం వాయిదా వేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉత్తర ప్రత్యుత్తరాల్లో అనుకూలతలు ఉంటాయి. 
 
మిథునం : ఉద్యోగస్తులు ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులకు గురికాకతప్పదు. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో ఎదుర్కొంటారు. స్థిర, చరాస్తులకు సంబంధించిన విషయాల్లో మెళకువ అవసరం. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. 
 
కర్కాటకం : బంధువుల రాకపోకలు అధికమవుతాయి. భాగస్వాముల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. అవసరానికి సరిపడ ధనం సమకూరుట వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు శ్రమించి సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. 
 
సింహం : వస్త్ర, బంగారు, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు కలిసిరాగలదు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రిప్రజెంటివ్‌లకు పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. 
 
కన్య : భాగస్వామ్యుల మధ్య వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
తుల : లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తోటివారి మాట, ధోరణి కారమంగా మానసిక ఆందోళన చెందుతారు. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల అంతగా అనుకూలించవు. వైద్యులకు పేరు, ఖ్యాతి లభిస్తాయి. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీల మనోవాంఛలు నెరవేరడంతో గృహంలో ప్రశాంతత, సౌఖ్యం నెలకొంటాయి. నిరుద్యోగులు నూతన వ్యక్తుల విషయంలో మోసపోయే ఆస్కారం ఉంది. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు అశాజనకం. 
 
ధనస్సు : ప్రియతములతో పర్యటనలు, విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పత్రి, ప్రైవేటు సంస్థల్లోని వారికి, యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. ఏ విషయంలోనూ మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. 
 
మకరం : ధనసహాయం, ధనవ్యయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. అవివాహిత యువకులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి నిరాశాజనకం. 
 
కుంభం : విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఉద్యోగస్తులకు స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ది కానవస్తుంది. 
 
మీనం : ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. సంఘంలో మీ మాటకు గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. హోటల్, తినుబండారాలు, పండ్లు, కొబ్బరి, కూరగాయల వ్యాపారులకు మందకొడిగా సాగుతుంది. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి.