శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-08-2020 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజిస్తే సంకల్ప సిద్ధి

మేషం : వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
వృషభం : వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య అవగాహనా లోపం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
మిథునం : వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన ఉండదు. తొందరపాటుతనం వల్ల నష్టాలు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. 
 
కర్కాకటం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఫ్లీడరు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. విద్య, సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. 
 
సింహం : దీర్ఘకాలిక రుణాలు తీర్చుతారు. స్త్రీలకు బంధు వర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సంతానం విషయంలో సంతృప్తికానవస్తుంది. సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అవసరం. క్రయ, విక్రయ రంగాల వారికి అనుకూలమైన కాలం. 
 
కన్య : ఒక మంచి పని చేశామన్న సంతృప్తి మీలో నెలకొంటుంది. ప్రభుత్వోద్యోగులకు ప్రమోషన్ బదిలీలు రావొచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
తుల : మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయంలో ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంద. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. వైద్య సలహా ఔషధ సేవనం తప్పదు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సమాన్య ఫలితాలనే ఇస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. 
 
వృశ్చికం : ఇతరుల మీ పట్ల ఆకర్షితులవుతారు. విద్యార్థులుక పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. 
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా కొనసాగుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్నచిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబం ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. స్థిరచరాస్తులు విషయంలో ఏకీభావం కుదరదు. కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. 
 
కుంభం : పెద్ద మొత్తం ధనం డ్రా చేసే విషయంలో మెళకువ చాలా అవసరం. ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక విషయాలు, పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తారు. 
 
మీనం : వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు అధికం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారులనుంచి తక్కువ అంచనా వేయడం వల్ల మాటపడక తప్పదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్లీడరు నోటీసులకు ధీటుగా స్పందిస్తారు.