శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-09-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజిస్తే...

మేషం : వస్త్రములు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు. విద్యార్థులకు పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. దంపతుల మధ్య కలహాలు, ప్రశాంతత లేమి వంటి చికాకులు ఎదుర్కొంటారు. 
 
వృషభం : మీరు ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. అధ్యాయపకులకు పనిభారం అధికమవుతుంది. బంధువులకు పెద్దమొత్తం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. 
 
మిథునం : మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మీ ఆగ్రహావేశాల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు అధికం. ఒక వ్యవహారం నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో అవగాహన లోపిస్తుంది. 
 
కర్కాటకం : ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అసరం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడు కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. 
 
సింహం : సహకార సంస్థల్లో వారికి, ప్రైవేటు, మార్కెటింగ్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత కానవస్తుంది. ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
కన్య : వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ధి. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. మీ కార్యక్రమాలు వాయిదావేసుకోవలసి ఉంటుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరం. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు.
 
తుల : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించక పోవడంతో ఆందోళనకు గురవుతారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ సంతానం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు రావలిసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. 
 
వృశ్చికం : నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అభివృద్ధి చేకూరుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ప్రముఖుల కలయిక ఉపకరిస్తుంది. 
 
ధనస్సు : ఆర్థిక విషయల్లో అనుకున్నత సంతృప్తికానరాదు. మీ యత్నాలకు సన్నిహితులు అండగా నిలుస్తారు. బంధువులను కలుసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, వ్యాపారులకు అనుకూలత. అనుకున్న పనులు పట్టుదలతో శ్రమించి సకాలంలో పూర్తిచేస్తారు. 
 
మకరం : స్త్రీల మాటతీరు కలహాలకు దారితీస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోని వారికి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
కుంభం : ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ వహించండి. రాబడికి మంచిన ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు తలెత్తవు. సభలు, సమావేశాల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తుల నిర్లక్ష్య ధోరణి మాటపడవలసి వస్తుంది. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు. 
 
మీనం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. నూతన వ్యాపారాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.