సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-09-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చిస్తే...

మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం : ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాలలో మార్పుండదు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. 
 
మిథునం : ఆత్మీయులతో కలిసి సరదాగా గడుపుతారు. వాహన సౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆస్తి పంపకాలకు సంబంధించి ముఖ్యులతో చర్చలు జరుపుతారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కర్కాటకం : వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. రుణం తీర్చడానికై చేయుయత్నాలలో సఫలీకృతులవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. ఫ్లీడర్లకు ఒత్తిడి పెరుగుతుంది.
 
సింహం : వస్త్ర, బంగారం, ఎలక్ట్రానికల్ వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. ధనవ్యయం, విరాళాలు ఇచ్చే విషయంలో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీల మాటకు  వ్యతిరేకంగా ఎదురవుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. 
 
కన్య : పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటికి వ్యక్తం చేయండి. అనుకున్న మొత్తం చేతికందుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యల విషయంలో ఒత్తిడి, ఆందోళన తప్పవు. దూరపు బంధువుల రాక మీలో నూతన ఉత్సాహం కలిగిస్తుంది. 
 
తుల : స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి గుర్తింపు లభిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 
 
వృశ్చికం : ఒక కార్యం నిమిత్త ప్రయాణం చేస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు చేజారిపోతాయి. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల జయం చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యం. కొంతమంది మీ నుంచి ధనసహాయం కోరవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. తలపెట్టిన పనులలో విఘ్నాలు చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి సలహా, సహకారం లభిస్తాయి. 
 
మకరం : స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. దైవ, పుణ్య సేవా, కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులలో ఒకరికి గురించి అప్రియమైన వార్తలు వింటారు. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికం అవుతుంది. 
 
కుంభం : కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. స్పెక్యులేషన్ కలిసిరాదు. చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. విలువైన వస్తుపులు, ఆభరణాలు అమర్చుకుంటారు. 
 
మీనం : ప్రముఖులతో పరిచాయలేర్పడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. కుటుంబీకుల కోసం ధనం వ్యయం చేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలలో అనుకూలత, కొత్త అనుభూతులకు లోనవుతారు. విద్యార్థుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.