ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (10:55 IST)

13-10-2019- ఆదివారం.. మీ రాశి ఫలితాలు..

మేషం: గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందటంతో ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.
 
వృషభం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
మిధునం: ధనం చేతిలో నిలబడటం కష్టమే. పట్టుదలతో శ్రమించినగాని అనుకున్నది సాధ్యం కాదు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. 
 
కర్కాటకం: చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు శ్రమించాలి. నూతన ఉద్యోగయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
 
సింహం: విద్యార్థులకు చికాకులు తప్పవు. రాబడికి మించిన ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూకుతగదు సంస్మరణలు, పూజలలో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను అధిగమిస్తారు.
 
కన్య: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారు ఎక్కువగా ఉన్నారు.
 
తుల: స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. ఉపాధి, పథకాలపై నిరుదోగులు దృష్టి సారిస్తారు. దైవదర్శనం చేసుకోగలుగుతారు. రహస్య విరోధులు అధికం కావటంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
వృశ్చికం: వ్యాపారాభివృద్ధికి అవిశ్రంతంగా శ్రమించవలసి వస్తుంది. ఊహించని ప్రయాణాలు సంభవం. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. సమావేశానికి ఏర్పట్లు చేయటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు.
 
ధనస్సు: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం: దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. సన్నిహితులకోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.
 
కుంభం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
మీనం: రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించుట వల్ల చికాకులు తప్పవు.