ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-01-2021 గురువారం దినఫలాలు - బాబా ఆలయంలో అన్నదానం చేస్తే...

మేషం : శ్రమాధిక్యత, మితిమీరిన ఆలోచనల వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
వృషభం : గతంలో మిమ్మలను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మిథునం : మిమ్మలను పొగిడే వారే కానీ సహకరించేవారు ఉండరు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ భావాలకు, రచనా పటిమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోడం శ్రేయస్కరం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. 
 
కర్కాటకం : దంపతుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేక పోతారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. చేపట్టిన పనులు వేగవంత అవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ప్రైవేు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. 
 
కన్య : శారీరక శ్రమ, అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రుణయత్నాలు మాత్రమే ముందుకు సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయి. బంధు మిత్రుల కలయిక సంతోషపరుస్తుంది. విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. 
 
తుల : స్థిరాస్తులు విక్రయించాలన్న ఆలోచన విరమించుకోవడం మంచిది. వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పని చేయవలసి ఉంటుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. భాగస్వామికుల మాటతీరు, కదలికలను గమనించడం ఎంతైనా మంచిది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో సఫలీకృతులవుతారు. కాంట్రాక్టర్లకు కార్మికులతో సఖ్యత నెలకొంటుంది.
 
ధనస్సు : ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఖర్చులు అధికమైన ధనానికి లోటుండదు. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. కొంతమొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. 
 
కుంభం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మనుష్యులు మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. 
 
మీనం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించవలసి ఉంటుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది.