శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (12:21 IST)

26-01-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే? (video)

ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే మనోసిద్ధి, శుభం కలుగుతుంది. 
 
మేషం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల సహకారంతో మీ దీర్ఘకాలిక సమస్య ఒక కొలిక్కి వచ్చే రాగలదు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృషభం: గృహంలో ఏదైనా శుభకార్యం నిమిత్తం చేసే కృషి ఫలిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. 
 
మిథునం: విద్యార్థులకు ఆత్మస్థైర్యం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా వుంటాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించవలసి వుంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కర్కాటకం: ఉమ్మడి, ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పెరిగిన పోటీ తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. హామీలు, మధ్యవర్తిత్వ విషయంలో పునరాలోచన మంచిది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
సింహం: బంధువులతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్నారుల మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై నుంచి ప్రభావం చూపుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. 
 
కన్య: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
తుల: బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. స్త్రీలు అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. వృత్తి విషయాల్లో గోప్యంగా ఉంచడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
 
ధనస్సు: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మకరం: ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో వుంటాయి. మనసులో భయాందోళనలూ అనుమానాలు వున్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలతో కలహాలు, అన్ని కార్యాలందు విఘ్నాలు ఎదుర్కొంటారు. 
 
కుంభం: ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబీకులతో కలిసి దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఆకస్మికంగా దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
 
మీనం: ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. సంఘంలో మీకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో మెళకువ అవసరం.