శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-07-2021 ఆదివారం దినఫలాలు - మీ ఇష్టదైవాన్ని సందర్శించిన శుభం

మేషం : ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. రాజకీయ నాయకులు, సభలు సమావేశఆల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యం విషయంలో మధ్య మధ్య వైద్యుల సలహా తప్పదు. 
 
వృషభం : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తు సామాగ్రి అందజేస్తారు. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యం. 
 
మిథునం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. నిబద్ధత, క్రమశిక్షణ పేరుతో మీరు కోరుకుంటున్న గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. మీ సోదరి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కర్కాటకం : సాంఘిక, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు హామీలు ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఎల్ఐసీ, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
సింహం : విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. హోటల్, తినుబండారు వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. 
 
కన్య : కార్యసాధనలో ఆత్మవిశ్వాసం, మొండి దైర్యంతో ముందుకుసాగండి. ద్విచక్రవాహనంపై ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. శారీరక శ్రమ, మానసిక ఆందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వాహనచోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. 
 
తుల : విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. బంధువుల రాకతో గృహంలో సందడి చోటుచేసుకుంటుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారస్తులకు మందకొడిగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
వృశ్చికం : రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ఆర్థిక సమస్యల వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినాగానీ నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. 
 
మకరం : రావలసిన బకాయిలు వాయిదాపడుట వల్ల ఆందోళనలకు గురవుతారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని ఫలితం దక్కుంది. కుటుంబీకులతో ఉల్లసంగా గడుపుతారు. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. నూతన ఒప్పందాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత వస్తువులనుకొని ఇబ్బందులు తెచ్చుకోకండి. 
 
మీనం : చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. ఆత్మీయులకు మీ సమస్యలు తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.