సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-01-2023 బుధవారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం..

Gemini
మేషం :- ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం శ్రేయస్కరం. వృద్ధాప్యంలో ఉన్నవారికి శారీరిక బాధలు సంభవిస్తాయి. పొదుపు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మిత్రుల ద్వారా ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్దంగా ఉంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
వృషభం : - కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగస్తులకు ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. ఏ ప్రయత్నం కలిసిరాక పోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు.
 
మిథునం :- ఇంట హడావుడి తగ్గటంతో మీలో నిస్తేజం చోటుచేసుకుంటుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బ్యాంకుల నుంచి పెద్దమొత్తం ధనం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
 
కర్కాటకం :- గృహంలోని ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరిక బాధలు సంభవిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుండి అభ్యంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
సింహం :- బంధువులను కలుసుకుంటారు. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. మీ స్థోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందు లెదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోకతప్పదు.
 
కన్య :- అంతగా పరిచయం లేనివారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. తరచూ సన్మానాలు సభల్లో పాల్గొంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
తుల :- విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టేఆస్కారం ఉంది. మీ అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. అవివాహితులకు త్వరలో శుభవార్తలు వింటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు రాగలవు. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలు కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మకరం :- వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. అకాల భోజనం, ప్రశాంతత లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
కుంభం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులతో సఖ్యత, రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మీనం :- బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు. కోర్టువ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.