శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-01-2024 శనివారం దినఫలాలు - మహాలక్ష్మి అమ్మవారిని ఎర్రని పూలతో పూజించిన...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర బ|| దశమి రా.8.47 స్వాతి సా.6.17 రా.వ.12.08 ల 1.48.
ఉ.దు. 6.35 ల 8.03.
మహాలక్ష్మి అమ్మవారిని ఎర్రని పూలతో పూజించి అర్చించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- వై.ద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా స్థానచలనం సంభవించును. ధనం బాగా ఖర్చుచేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులవల్ల కావలసిన పనులను చేయించుకుంటారు.
 
వృషభం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సోదరి, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శస్తారు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. మీ సమర్థతపై ఎదుటి వారికి నమ్మకం కలుగుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
 
కర్కాటకం :- బంధువులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
సింహం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
కన్య :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
తుల :- నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహాన్నిఅదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు మరింత బలపడతాయి. పారిశ్రామిక రంగాలలోని వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
వృశ్చికం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
ధనస్సు :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు.
 
మకరం :- వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఇతర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. వైద్యులకు ఏకాగ్రత అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికవుతాయి. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. 
 
కుంభం :- నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. విద్యార్థులు ఇతర వ్యాపకాలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. 
 
మీనం :- తొందరపడి చేసి వాగ్దానాలు సమస్యలు తెచ్చుకోకండి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు తప్పవు. కుటింబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. కంప్యూటర్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. ఆత్మీయుల రాకతో గృహం కళకళలాడుతుంది.