సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (08:46 IST)

11-01-2024 గురువారం దినఫలాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు...

horoscope
మేషం :- శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. మీ నూతన పథకాలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. మీ మిత్రుల కోసం బంధువుల కోసం అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు.
 
వృషభం :- భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆశక్తి చూపిస్తారు. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. 
 
మిథునం :- రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. సామూహిక దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యా, భర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రుణవిముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు.
 
సింహం :- మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఒక కార్య సాధనకోసం ఒకటికి పది సార్లు ఆలోచించవలసి ఉంటుంది.
 
కన్య :- ఓర్పు సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది. మీ సంతానం విపరీత ధోరణి వల్ల అసహనానికి లోనవుతారు. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో మెళకువ వహించండి. అందరి సహాయ, సహకారాలు అందుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు.
 
తుల :- మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనంను విరివిగా ఖర్చులు చేస్తారు. వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. స్త్రీలకు బంధువులలో సఖ్యత నెలకొంటుంది.
 
వృశ్చికం :- దంపతుల మధ్య చిరు కలహాలు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధనం అధికంగా వ్యయం చేస్తారు. రావలసిన ధనం రావడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి. తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఏ కార్యములు చేయవద్దు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం.
 
ధనస్సు :- స్త్రీలు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. తరచూ ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఆలయాలను సందర్శిస్తారు. వాయిదాలు తీసుకోవడం మంచిది.
 
మకరం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం.
 
కుంభం :- విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.
 
మీనం :- గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు ఊహించని చికాకులు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను అధికమవుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.