1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-03-2023 తేదీ మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో..

Taurus
మేషం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ముఖ్యల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. విద్యార్థులకు స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
వృషభం :- స్త్రీలకు ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. విద్యార్థినులకు భవిష్యత్, తమ శక్తిసామర్ధ్యాల పట్ల విశ్వాసం పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి అధికం అవుతుంది. ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య రంగాల్లో వారికి శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం.
 
మిథునం :- దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగిపోగలవు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టటం మంచిది కాదు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థిస్తారు. దూర ప్రయాణాలు చేయాలనే మీ ఆలోచన త్వరలోనూ రూపు దాల్చగలదు. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది.
 
కర్కాటకం :- స్త్రీలకు వ్యాపకాలు, కొత్త పరిచయాలు అధికమవుతాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తంచేయండి. సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గ్రహించండి. నిత్యావసర వ్యాపారస్తులకు శుభదాయకం. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులలో తలమునకలవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులుతప్పవు.
 
సింహం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. స్త్రీలకు తల, కాళ్లు,నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రేమికులకు ప్రతి విషయంలోను ఓర్పు ఎంతో అవసరం. ఆధ్యాత్మిక చర్చలు, ఆలయ సందర్శనలు స్వాంతన కలిగిస్తాయి.
 
కన్య :- ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. పాత బాకీల వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. పొగడ్తలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలించవు.
 
తుల :- ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వైద్యరంగాల్లో వారికి పురోభివృద్ధి. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బంధువుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- ప్రైవేటు, రిప్రజెంటివ్‌ల సంస్థలలోని వారు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు అకారణంగా నవ్వటం వల్ల కలిగే అనర్థాలను గ్రహిస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత, మెళుకువ అవసరం.
 
ధనస్సు :- బంధువుల రాకతో అనుకోనికొన్ని ఖర్చులు మీద పడతాయి. గృహ వాస్తుదోష నివారణ వల్ల కలిగిన ఫలితాలు గమనిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడగలవు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
మకరం :- మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేయవలసి ఉంటుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. విదేశీయానం, రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తొలగి పోతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తి కానరాదు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవవహారాల్లో ఏకాగ్రత వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. అధికారులకు తరుచు పర్యటనలు, తనిఖీలు, స్థానచలనం తప్పకపోవచ్చు.
 
మీనం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.