ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-05-2023 గురువారం రాశిఫలాలు - లక్ష్మీ కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి...

astro11
మేషం :- కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్నిస్తుంది.
 
వృషభం :- వృత్తిపరంగా చికాకులు, సమస్యలు తలెత్తినా ధైర్యంగా నిలదొక్కుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం.
 
మిథునం :- మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. ఖర్చులు తగ్గించు కోవాలనే మీ యత్నం అనుకూలించదు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. చెక్కులజారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగాఉండాలి. 
 
కర్కాటకం :- భాగస్వామికులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధికానవస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి. 
 
సింహం :- ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో అనుమానాలు విడనాడి శ్రమించండి. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం.
 
కన్య :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు పడతారు. ఉద్యోగస్తులకు హోదా పెరగటం, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభపరిణామాలుంటాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
తుల :- ఏ వ్యక్తికీ అతిచనువు ఇవ్వటం మంచిది కాదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు.
 
వృశ్చికం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికిఒత్తిడి తప్పదు.
 
ధనస్సు :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో లౌక్యం అవసరం. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది. కొబ్బరి, పండ్ల, పూలు, పానీయ చిరు వ్యాపారులకు లాభసాటిగాఉంటుంది.
 
మకరం :- బంధువులను కలుసుకుంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల ఒక కొలిక్కి వచ్చే అవకాశంఉంది. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం.
 
కుంభం :- ప్రైవేటు సంస్థలలోవారికి విధి నిర్వహణలో ఏకాగ్రత లోపం వల్ల మాటపడక తప్పదు. దైవ సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారు మార్పులకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు.
 
మీనం :- ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. కొంతమంది మీ నుండి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు. రాజకీయాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు.